మెగాస్టార్ “గాడ్ ఫాదర్” ఆడియో రైట్స్ వారికే !

Published on Jul 3, 2022 11:10 pm IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ “గాడ్ ఫాదర్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వినిపిస్తోంది. గాడ్ ఫాదర్ సినిమా ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో సంస్థ ‘సారేగామా సౌత్’ కైవసం చేసుకుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా ఈ సినిమాని తెరకెక్కించాలని దర్శకుడు మోహన్ రాజా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ వెరీ స్టైలిష్‌ గా ఉండబోతుంది. అందుకే, ఈ చిత్రం పై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :