`స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు పార్ట్ 2 !

Vamshi Rashmika

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా… కొర‌టాల శివ మాట్లాడుతూ – “మెగాస్టార్‌గారిని ఇక్క‌డ చూడ‌టం ఆనందంగా ఉంది. స‌రిలేరు నీకెవ్వ‌రు అనే టైటిల్ పెట్టిన‌ప్పుడు యాప్ట్ టైటిల్ పెట్టార‌ని హ్యాపీగా అనిపించింది. అలాగే ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాను అనిల్ రావిపూడి అర్థం చేసుకున్నంత‌గా ఎవ‌రూ అర్థం చేసుకోరు. త‌న సినిమాలో ఫుల్ మీల్స్ ఉంటుంది. మీరు ఎంట‌ర్‌టైన్ చేసే స్టైల్‌కి ఓ సూప‌ర్‌స్టార్ యాడ్ అయితే ఎలా ఉంటుందో అర్థ‌మ‌వుతుంది. ఈవాళే ఆయ‌న తండ్రి కూడా అయ్యాడు. త‌న‌కు ఈ ఇయ‌ర్ ఓ బ్యాంగ్‌లా స్టార్ట్ అవుతుంది. నేను విజ‌య‌శాంతిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆమెను స్క్రీన్‌పై చూడ‌టానికి చాలా ఆస‌క్తిగా ఉంది. దేవిశ్రీ నిజంగానే రాక్‌స్టార్‌. ఎంటైర్ యూనిట్‌కు ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నాను“ అన్నారు.

వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ – “నాకు సినిమా అంటే పిచ్చి పుట్ట‌డానికి కార‌ణం మీరే. దాని వ‌ల్లే ఇక్క‌డ వ‌రకు రాగ‌లిగాను. ఆయ‌నతో పాటు మ‌హేశ్‌గారు, విజ‌య‌శాంతిగారుముందు ఇలా నిల‌బ‌డి మాట్లాడ‌టం గౌర‌వంగా భావిస్తున్నాను. చిరంజీవి, విజ‌య‌శాంతిగారు క‌లిసి చేసిన సినిమాలు గురించి చాలానే చెప్పుకుంటూ పోవ‌చ్చు. అనిల్‌కి కంగ్రాట్స్‌. ర‌ష్మిక‌కు అభినంన‌లు. దేవిశ్రీ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. మీ కెరీర్‌లో మ‌హ‌ర్షి బిగ్గెస్ట్ హిట్‌. జ‌న‌వ‌రి 11న అది మారాల‌ని నేను కోరుకుంటున్నాను. స‌రిలేరు నీకెవ్వ‌రు మీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని బావిస్తున్నాను. ఈ సినిమా కోసం అనిల్‌, మ‌హేష్‌గారు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. జ‌న‌వ‌రి 11న పండ‌గ సినిమా. ఈ సంక్రాంతి మూడు రోజుల ముందుగానే రాబోతుంది. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది వెరీ బెస్ట్‌“ అన్నారు.

ర‌ష్మిక మంద‌న్న మాట్లాడుతూ – “చిరంజీవిగారు నా ఛ‌లో, గీత గోవిందం సినిమా ఈవెంట్స్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా వ‌చ్చారు. ఆయ‌న ల‌క్కీ ఛార్మ్‌గా భావిస్తున్నాను. అనిల్ రావిపూడికి కంగ్రాట్స్‌.. త‌న ఈ సినిమాతో హిస్ట‌రీ క్రియేట్ చేయ‌బోతున్నారు. ఇందులో న‌న్ను భాగం చేసినందుకు అనిల్‌కి థ్యాంక్స్‌. దేవిశ్రీ నాపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని హీ ఈజ్ సో క్యూట్‌.. మైండ్ బ్లాక్ సాంగ్స్‌తో నిల‌బెట్టుకున్నాన‌నే అనుకుంటున్నాను. విజ‌య‌శాంతిగారిని తొలిసారి క‌లిసిన‌ప్పుడు చాలా భ‌య‌ప‌డ్డాను. కానీ ఆమె నాలో చాలా కాన్ఫిడెంట్‌ను నింపింది. నేను ఆయ‌న్ని చాలానే ఇరిటేట్ చేశాను. నాపై న‌మ్మ‌కం ఉంచినందుకు అనిల్ సుంక‌ర‌, దిల్‌రాజుగారికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

ఆది శేష‌గిరిరావు మాట్లాడుతూ – “నేను తీసిన కొడుకు దిద్దిన కాపురం సినిమాతోనే మ‌హేశ్ మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. పెద్ద న‌టుల మ‌ధ్య 14 వ‌య‌సున్న లిటిల్ స్టార్ .. ఇప్పుడు సూప‌ర్‌స్టార్ అయ్యాడు. అనిల్ సుంక‌ర‌గారు, డైరెక్ట‌ర్ అనిల్ గారు సినిమా మొద‌లు పెట్ట‌కుండానే మేం సంక్రాంతికి సినిమా ఇస్తున్నాం అని చెప్పిన రోజున ఇద్ద‌రూ ఇచ్చిన మాట ప్ర‌కారం సినిమా చేస్తే విజ‌య‌వాడ‌లో ఘ‌న స‌న్మానం చేస్తాన‌ని మాట ఇచ్చాను. ఇలాంటి డిసిప్లెయిన్ ఉంటే ఇండ‌స్ట్రీ బావుంటుంది. అందుకు హీరోల స‌హకారం కూడా అవ‌స‌ర‌మే. ఇంత పెద్ద సినిమాను ఆరు నెల‌ల్లో పూర్తి చేసినందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను అభినందిస్తున్నాను. ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్‌ను క్రియేట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. దేవిశ్రీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మంచి సినిమా చూడ‌బోతున్నామ‌నే ఫీలింగ్ క‌లిగింది. విజ‌య‌శాంతిగారు, ర‌ష్మిక స‌హా అంద‌రికీ అభినంద‌న‌లు“ అన్నారు.

Exit mobile version