‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ రెడీ అయింది

Sarileru Neekevvaru

సందిగ్ధత తొలగింది… సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ 11న ‘అల వైకుంఠపురములో’ 12న విడుదలకానున్నాయి. దీంతో ఇరు టీమ్స్ తదుపరి పనుల్లో బిజీ అయ్యాయి. ఈరోజు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. అలాగే ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు. రాత్రి 9:09 గంటలకు నేరుగా ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

దీంతో ట్రైలర్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

Exit mobile version