“సరిపోదా శనివారం” యూఎస్ బుకింగ్స్ డీటైల్స్ ఇవే!

“సరిపోదా శనివారం” యూఎస్ బుకింగ్స్ డీటైల్స్ ఇవే!

Published on Aug 7, 2024 10:52 PM IST

డిఫెరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే హీరో నాని, సరిపోదా శనివారం చిత్రంతో ఈ ఆగస్టు 29 వ తేదీన థియేటర్ల లోకి రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటించగా, విలక్షణ నటుడు ఎస్.జే. సూర్య కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో ప్రత్యంగిరా సినిమాస్ మరియు AA క్రియేషన్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

తాజాగా యూఎస్ ప్రాంతంలో అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబందించిన ఒక అప్డేట్ ను అందించారు. ఆగస్టు 9 వ తేదీన యూఎస్ ప్రాంతంలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 28 వ తేదీన ప్రీమియర్ షోలతో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు