“సర్కారు వారి పాట” క్లాస్ ప్రోమోతో మాస్ రెస్పాన్స్..!

Published on Feb 12, 2022 7:00 am IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి అభిమానులు ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సాంగ్ నుంచి మేకర్స్ నిన్న సాంగ్ ప్రోమో ని వదిలారు.

అయితే ఎంతో క్లాస్ గా స్టైలిష్ గా ఉన్న ప్రోమో చిన్న బిట్ అయినా వినడానికి ఎంతో బాగుంది. మరి కానీ దీనికి వచ్చిన రెస్పాన్స్ అయితే మాస్ అని చెప్పాలి. ఇది రిలీజ్ అయ్యిన 13 గంటల్లోనే 4 మిలియన్ కి పైగా వ్యూస్ కొల్లగొట్టేసింది.. అంతే కాకుండా రెండున్నర లక్షలకు పైగా లైక్స్ ని ఇది అందుకుంది. మొత్తానికి మాత్రం మహేష్ మరియు థమన్ ల నుంచి మరో చార్ట్ బస్టర్ ఆల్బమ్ కి రంగం సిద్ధం అయ్యిందని చెప్పాలి. మరి ఈ వాలెంటైన్స్ డే కి వచ్చే ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :