సర్కార్ క్రేజ్ మాములుగా లేదుగా !

Ajit5

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చిత్రం విడుదలవుతుందంటే తమిళనాడులో ఆ హడావిడి మాములుగా ఉండదు. అసలే విజయ్ కి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ. ఇక ఆయన నటించిన తాజా చిత్రం ‘సర్కార్’ విడుదలకు రెండు వారాల ముందే ఫ్యాన్స్ సందడి మొదలయ్యింది. ఇక ఈ క్రేజ్ తమిళనాడు తో పాటు మిగితా దక్షిణాది రాష్ట్రాలకు కూడా పాకింది.

తమిళనాడు తరువాత కేరళ లో విజయ్ కి ఎక్కువ మంది అభిమానులు వున్నారు. ఈ సినిమా కు అక్కడ ఏకంగా 200 ఫాన్స్ షో లు వేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందోనని ఇక గతంలో విజయ్ నటించిన చిత్రాల ఫై అంతగా ఆసక్తిని చూపించని తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న విడుదలైన ఈ చిత్ర తెలుగు వెర్షన్ టీజర్ 11లక్షల వ్యూస్ ను రాబట్టుకుంది. దాని బట్టి అర్ధం చేసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కు ఎలాంటి క్రేజ్ ఉందని విజయ్ కెరీర్ లోనే ఈ చిత్రం బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోకూడా ఈ చిత్రానికీ మంచి బిజినెస్ జరిగింది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో నవంబర్ 6న భారీ స్థాయిలో విడుదలకానుంది.

Exit mobile version