సర్కార్ లేటెస్ట్ కలక్షన్స్ !

Sarkar1
ఇళయ దళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ దీపావళి రోజు విడుదలై బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. తమిళ్లో ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చిన కూడా విజయ్ కు వున్న ఫాలోయింగ్ దృష్ట్యా అక్కడ కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

ఇక తెలుగులో కూడా విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా ఆ ప్రభావం కలెక్షన్ల ఫైమాత్రం పడలేదు. ఊహించని రీతిలో నాలుగు రోజులో 10కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈచిత్రాన్ని అశోక్ వల్లభనేని 6కోట్లకు కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 7కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే 6కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఈ వారంతంలో బ్రేక్ ఈవెన్ చేరుకోవడం ఖాయం. విజయ్ కి తెలుగులో ఇవే అత్యధిక కలెక్షన్స్ కావడం విశేషం. ఈచిత్రంతో ఆయన తెలుగులో తన మార్కెట్ ను పెంచుకున్నాడు.

Exit mobile version