ఈ ఏరియాల్లో “సర్కారు వారి” 2 రోజుల సాలిడ్ వసూళ్ల వివరాలు.!

Published on May 14, 2022 10:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హాయిగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” చిత్రం. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అయితే సాలిడ్ వసూళ్లను ఫస్ట్ డే అందుకుని అదరగొట్టింది. ఇక ఈ చిత్రంపై రెండో రోజు వసూళ్లకు సంబంధించి కొన్ని ఏరియాల డీటెయిల్స్ బయటకి వచ్చాయి.

మొదట గోదావరి జిల్లాల్లో చూసినట్టు అయితే ఈస్ట్ గోదావరిలో రెండో రోజు 1.08 కోట్లు షేర్ రాబట్టగా రెండు రోజుల్లో 4.33 కోట్ల షేర్ తో నాన్ రాజమౌళి రికార్డును సెట్ చేసింది. ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే రెండు రోజులకి గాను 3.45 కోట్ల షేర్ ని రాబట్టింది.

ఇక అలాగే కృష్ణ మరియు నెల్లూరు జిల్లాల్లో చూసినట్టు అయితే కృష్ణ జిల్లాలో రెండు రోజులకి గాను 3.47 కోట్ల షేర్ అలాగే నెల్లూరు లో 1.97 కోట్ల షేర్ ని ఈ చిత్రం అందుకుంది. ఈ నాలుగు ఏరియాల్లో అయితే ఈ రకంగా ఈ చిత్రం సాలిడ్ వసూళ్లను రాబట్టి స్ట్రాంగ్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం :