తెలుగు స్టేట్స్ లో “సర్కారు వారి” 3వ రోజు సాలిడ్ వసూళ్ల వివరాలు.!

తెలుగు స్టేట్స్ లో “సర్కారు వారి” 3వ రోజు సాలిడ్ వసూళ్ల వివరాలు.!

Published on May 15, 2022 4:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ బాక్సాఫీస్ బ్లాస్టర్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ క్రేజ్య్ క్రేజీ ఎంటర్టైనర్ మంచి మెసేజ్ తో కూడా వచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంతగానో ఆదరిస్తుంది. అయితే ఈ సినిమా వసూళ్లపై ఇప్పుడు లేటెస్ట్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఏపీ మరియు తెలంగాణాలో ఈ చిత్రం మూడు రోజుల వసూళ్ల డీటెయిల్స్ ఏరియాల వారీగా చూసినట్టు అయితే..

నైజాం – 23.27 కోట్లు
సీడెడ్ – 7.92 కోట్లు
ఉత్తరాంధ్ర – 7.33 కోట్లు
గుంటూరు – 6.92 కోట్లు
ఈస్ట్ – 5.39 కోట్లు
కృష్ణ – 4.39 కోట్లు
వెస్ట్ – 3.9 కోట్లు
నెల్లూరు – 2.42 కోట్లు

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 61.54 కోట్ల షేర్ ని రాబట్టి అదరగొట్టింది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు