బాక్సాఫీస్ బ్లాస్ట్..తెలుగు స్టేట్స్ లో “సర్కారు వారి పాట” డే 1 వసూళ్ల వివరాలు.!

Published on May 13, 2022 10:03 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినాకి ఏమాత్రం తగ్గకుండా భారీ స్థాయి వసూళ్లను కొల్లగొడుతుంది అనే నమ్మకంగా రిలీజ్ అయ్యిన లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట”. అనేక అంచనాలు నడుమ రిలీజ్ అయ్యున ఈ చిత్రం ఆల్రెడీ నాన్ RRR రికార్డులతో నైజాం లో ఖాతా తెరవగా ఇప్పుడు టోటల్ ఏపీ తెలంగాణాలో కూడా నాన్ RRR ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ మొదటి రోజే ఈ చిత్రం సెన్సేషనల్ ఓపెనింగ్ 36.63 కోట్ల షేర్ ని అందుకొని బాక్సాఫీస్ దగ్గర ఫైర్ చూపించింది. ఇక ఏరియాల వారీగా వచ్చిన వసూళ్ల షేర్ వివరాలు చూసినట్టు అయితే..

నైజాం – 12.24 కోట్లు
సీడెడ్ – 4.7 కోట్లు
ఉత్తరాంధ్ర – 3.73 కోట్లు
తూర్పు గోదావరి – 3.25 కోట్లు
పశ్చిమ గోదావరి – 2.74 కోట్లు
గుంటూరు – 5.83 కోట్లు
కృష్ణ – 2.58 కోట్లు
నెల్లూరు – 1.56 కోట్లు

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట 36.63 కోట్ల షేర్ ని కొల్లగొట్టి అదరగొట్టింది.

ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ సినిమాని తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా ఈ బిగ్ ఎంటర్టైనర్ ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :