ఇంకా మంచి హోల్డ్ లో “సర్కారు వారి పాట”.!

Published on Jun 5, 2022 10:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ అండ్ సోషల్ డ్రామా “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నడుమ వచ్చి భారీ వసూళ్లనే ఈ చిత్రం అందుకుంది. మరి మొదటి రెండు వారాలు సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఆ తర్వాత కొత్త రిలీజ్ లు ఆ సినిమాలు కూడా హిట్ అవ్వడంతో ఈ సినిమా వసూళ్లు సాధారణంగానే తగ్గుముఖం పట్టాయి.

అయితే ఇక ఇప్పుడు మళ్ళీ వారాంతంలోకి రావడంతో తెలుగు స్టేట్స్ లో చాలా చోట్ల ఈ చిత్రానికి మళ్ళీ స్ట్రాంగ్ హోల్డ్ కనబడుస్తున్నట్టు తెలుస్తుంది. పలు ప్రాంతాల్లో అయితే హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయట. దీనితో ఈ చిత్రం అయితే ఇప్పటికీ మంచి హోల్డ్ లోనే ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :