సర్ధార్ తో సర్కారు వారి పాట డైరెక్టర్ మూవీ ఫిక్స్ ?

Published on Feb 16, 2023 11:00 pm IST

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ల కలయికలో తెరకెక్కిన గీతా గోవిందం మూవీ భారీ విజయంతో దర్శకుడిగా గొప్ప క్రేజ్ సొంతం చేసుకున్నారు యువ దర్శకుడు పరశురామ్ పెట్ల. దాని అనంతరం ఏకంగా టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన తెరకెక్కించిన సర్కారు వారి పాట మూవీ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సంగతి తెల్సిందే. ఇక దాని అంతరం నెక్స్ట్ సినిమా కోసం కొంత గ్యాప్ తీసుకున్న పరశురామ్ ఇటీవల తన నెక్స్ట్ మూవీని విజయ్ దేవరకొండ తో చేస్తున్నట్లు ప్రకటించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మించనున్నట్లు ప్రకటన కూడా వచ్చింది. అయితే విషయం ఏమిటంటే, వీరిద్దరి సినిమా పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టనుందట. ప్రస్తుతం ఖుషి మూవీ చేస్తోన్న విజయ్ దేవరకొండ, దాని తరువాత గౌతమ్ తిన్ననూరి మూవీ చేయనున్నారు. అందుకే ఈలోపు మరొక హీరోతో సినిమా చేయడానికి సిద్ధం అయిన పరశురామ్, లేటెస్ట్ గా సర్ధార్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన కార్తీని రెండు రోజుల క్రితం ప్రత్యేకంగా కలిసి ఒక మంచి స్టోరీ వినిపించినట్లు తెలుస్తోంది. కాగా కార్తీ కి ఆ స్టోరీ ఎంతో బాగా నచ్చడంతో అతి త్వరలో దీనిపై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా రానున్నట్లు చెప్తున్నారు. కాగా ఈ మూవీ కార్తీ మూవీ కెరీర్ 25వ సినిమాగా రూపొందే అవకాశం ఉందట.

సంబంధిత సమాచారం :