లవర్స్ డే రోజున “సర్కారు వారి పాట” ఫస్ట్ సింగిల్

Published on Jan 26, 2022 9:50 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్ టైన్మెంట్ ల పై ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది. ఫిబ్రవరి 14 వ తేదీన ప్రేమికుల రోజున ఈ చిత్రం నుండి తొలి పాట ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ అప్డేట్ ను అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :