కాస్త ముందే “సర్కారు వారి పాట” ఫస్ట్ సాంగ్ రిలీజ్.!

Published on Feb 13, 2022 7:13 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ రేపు ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే ని ముహూర్తంగా పెట్టుకున్నారు.

ఇక ఈ గ్యాప్ లో మేకర్స్ ఒక్కొక్కటిగా అప్డేట్ ఇస్తూ ప్లాన్ ప్రకారం వస్తుండగా మధ్యలో ఊహించని షాక్ తగిలింది. అనుకున్న సమయానికి ముందే సాంగ్ వీడియోతో సహా లీక్ అయ్యిపోయింది. దీనితో చిత్ర యూనిట్ గానీ సంగీత దర్శకుడు థమన్ ల బాధ కానీ వర్ణనాతీతం. దీనితో ఇక మేకర్స్ చేసేది ఏమీ లేక ఫుల్ సాంగ్ ని ఈరోజే రిలీజ్ చేస్తున్నామని టైం తో అప్డేట్ కూడా వదులుతామని కన్ఫర్మ్ చేశారు.

ఈ ఉదయమే ఈ అప్డేట్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ సాంగ్ లీక్ అయ్యిన దానికంటే ఎన్నో రెట్లు బాగుంటుంది అని ప్రామిస్ చేస్తున్నారు. మరి ఈ సాంగ్ టైం ఎప్పుడో చూడాలి.

సంబంధిత సమాచారం :