“సర్కారు వారి పాట” ఇంటర్వెల్ సీక్వెన్స్‌పై ఇంట్రెస్టింగ్ టాక్..!

Published on Oct 5, 2021 12:51 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవగా, ఈ రేసులోకి “ఆర్ఆర్ఆర్” రావడంతో సర్కారు రిలీజ్ డేట్‌ని ఏప్రిల్‌కి వాయిదా వేస్తున్నారన్న ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా సర్కారు వారి ఇంటర్వెల్ సీక్వెన్స్‌పై కూడా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో మహేశ్ బాబు సింహాచల నరసింహుడి అవతారంలో కనిపిస్తాడట. మరీ ఇందులో ఎంతవరకు నిజముందనేది అయితే తెలీదు కానీ నిజంగా అలా కనిపిస్తే మాత్రం మహేశ్ ఫ్యాన్స్‌కి ఇది డబుల్ డోస్ ఆనందాన్ని ఇవ్వడం మాత్రం గ్యారెంటీ అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :