“శ్యామ్ సింగ రాయ్” ఆడియో హక్కులు వారి చెంతకు.!

Published on Oct 21, 2021 1:30 pm IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న పలు లేటెస్ట్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా “శ్యామ్ సింగ రాయ్” కూడా ఒకటి. నాని లుక్ నుంచి ప్రతీ అంశం లోనూ ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను కూడా తెచ్చుకొని పాన్ ఇండియన్ రిలీజ్ అంటూ సర్ప్రైజ్ ఇచ్చింది.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు చిత్ర యూనిట్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ చేశారు. ఈ చిత్రం తాలూకా ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సంస్థ ‘సరిగమ’ వారు సొంతం చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ చిత్రానికి టాలెంటెడ్ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

ఇక ఈ చిత్రంలో సాయి పల్లవితో పాటు మడోనా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. అలాగే ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 24న కేవలం థియేటర్స్ లోనే రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :

More