“సర్కారు వారి పాట” మాస్ డ్యూయెట్ ప్రోమోకి సాలిడ్ రెస్పాన్స్.!

Published on May 7, 2022 7:08 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల కాంబినేషన్ లో ఫస్ట్ టైం తెరకెక్కించిన క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే ఒక మోస్ట్ అవైటెడ్ సినిమా గా వస్తుంది. అయితే ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ మంచి కేజ్రీగా మారగా నిన్ననే ఈ సినిమా నుంచి వచ్చిన మాస్ డ్యూయెట్ మా మా మహేశా నుంచి ప్రోమో రిలీజ్ చెయ్యగా దానికి భారీ స్థాయి రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది.

అల్రెడీ 4 మిలియన్ కి పైగా వ్యూస్ ని క్రాస్ చేసేసి 3 లక్షల కి దగ్గరలో లైక్స్ వచ్చేసాయి. దీనితో ఈ సాంగ్ కి ఎలాంటి క్రేజ్ నెలకొందో అర్ధం చేసుకోవాలి. థమన్ నాటు ట్యూన్ వాటిని మించి మహేష్ ఎనర్జీ తనతో పాటుగా కీర్తి సురేష్ కెమిస్ట్రీ ఈ సాంగ్ లో అదిరిపోయాయి. వీటితో ఈ ప్రోమో చూసిన వారు అంతా ఎప్పుడు ఫుల్ సాంగ్ వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా మే 12 న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :