ఏఎంబీ సినిమాస్ లో “సర్కారు వారి” రికార్డు మార్క్ కలెక్షన్.!

Published on Jun 16, 2022 9:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. మహేష్ కెరీర్ లో మంచి మోస్ట్ అవైటెడ్ గా వచ్చిన ఈ చిత్రం వింటేజ్ వైబ్స్ ని మళ్ళీ గుర్తు చేస్తూ భారీ వసూళ్లను అందుకొని అనేక రికార్డులు తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పింది. మరి అలాగే హైదరాబాద్ సిటీలో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లనే అందుకుంది.

లేటెస్ట్ గా అయితే హైదరాబాద్ ప్రిస్టేజియస్ మల్టీప్లెక్స్ అయినటువంటి ఏఎంబీ సినిమాస్ లో ఈ చిత్రం RRR తర్వాత అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా ఆల్ టైం రికార్డు వసూళ్లను సెట్ చేసింది. ఇందులో సర్కారు వారి పాట 2 కోట్ల సాలిడ్ గ్రాస్ తో మొట్ట మొదటి సారిగా ఈ ఫీట్ అందుకున్న రీజనల్ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :