మాస్ అండ్ పవర్ ఫుల్ గా సూపర్ స్టార్ “సర్కారు వారి పాట” ట్రైలర్!

Published on May 2, 2022 4:16 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ చిత్రం లో సూపర్ స్టార్ సరసన హీరోయిన్ గా తొలిసారి నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. మొదటి నుండి ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉండటం తో, ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకి, ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ అని చెప్పాలి. 105 షాట్స్ ను డెలివరీ చేస్తాం అంటూ ప్రకటించిన మేకర్స్, మాసివ్ ట్రైలర్ తో ఆకట్టుకున్నారు.

ట్రైలర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్ మరియు డైలాగ్స్ హైలెట్ అని చెప్పాలి. నా ప్రేమను దొంగలించగలవు, స్నేహాన్ని దొంగలించగలవు, కానీ,నా డబ్బుని దొంగలించలేవు అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. థమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ లో మ్యాజిక్ చేశారు. కీర్తి సురేష్ ఈ చిత్రం లో చాలా గ్లామరస్ గా కనిపించనున్నారు అని ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ పరశురాం సూపర్ స్టార్ ను చూపించిన విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, అజయ్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ను మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :