‘సర్కారు వారి పాట’ కోసం థమన్ ఎలాంటి మ్యూజిక్ ట్రాక్ రెడీ చేస్తున్నాడంటే..!

Published on Oct 21, 2021 1:29 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జీ. మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రెడీ చేసిన ఓ మ్యూజిక్ ట్రాక్‌ను థమన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఈ ట్రాక్ మీ స్పీకర్లను బద్దలుకొట్టడం ఖాయంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. నేను ఈ మ్యూజిక్ ట్రాక్ విన్న ప్రతిసారి స్పీకర్లు భయపడుతున్నాయని అన్నాడు. అయితే ఈ మ్యూజిక్ ట్రాక్ ఫస్ట్ సింగిల్ కోసమే అని ప్రచారం జరుగుతుంది. మరింకెందుకు ఆలస్యం మీరో కూడా ఈ మ్యూజిక్ ట్రాక్‌ని ఓసారి వినేసేయండి.

సంబంధిత సమాచారం :

More