నైజాంలో “సర్కారు వారి పాట” 3 రోజుల వసూళ్ల డీటెయిల్స్.!

Published on May 15, 2022 3:30 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో తెరకెక్కించిన చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం సాలిడ్ కలెక్షన్స్ ని ఈ వారాంతంలో రాబడుతుంది. అయితే నిన్న శుక్రవారం వర్కింగ్ డే చిన్నగా డ్రాప్ అయినా శనివారం మాత్రం అదిరే వసూళ్లను అందుకున్నట్టు తెలుస్తుంది.

ఇక మూడో రోజు నైజాం లో వసూళ్లు వివరాలు చూసినట్టు అయితే మూడో రోజుకి గాను ఈ చిత్రం జి ఎస్ టి తో కలిపి 5.8 కోట్ల షేర్ వసూలు అయ్యింది. దీనితో ఈ సినిమా మూడు రోజులకి గాను 23.23 కోట్ల షేర్ ని అందుకుంది బ్రేక్ ఈవెన్ వైపుగా దూసుకెళ్తుంది. మొత్తానికి అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం సర్కారు వారి బ్లాస్టర్ ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :