నైజాంలో ‘నాన్ RRR’ వసూళ్లతో “సర్కారు వారి” కోత మొదలు.!

నైజాంలో ‘నాన్ RRR’ వసూళ్లతో “సర్కారు వారి” కోత మొదలు.!

Published on May 13, 2022 8:56 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా నిన్న రిలీజ్ కాగా అన్ని ఏరియాల్లో కూడా సాలిడ్ ఆక్యుపెన్సీతో ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. అయితే వసూళ్ల పరంగా ఈ సినిమా భారీ నంబర్స్ ని నమోదు చేస్తుండగా లేటెస్ట్ గా నైజాం లో ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్ల వివరాలు బయటకి వచ్చాయి.

మరి పి ఆర్ నంబర్లు ప్రకారం ఈ చిత్రంనాన్ RRR ఓపెనింగ్స్ సెట్ చేసి రికార్డు లెవెల్లో 12.24 కోట్ల షేర్ ని రాబట్టిందట. దీనితో బాక్సాఫీస్ దగ్గర కోత వేరే లెవెల్లో స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. ఆఫ్ లైన్ లో టాక్ ఆల్రెడీ బాగుంది కాబట్టి మహేష్ ఈ వారాంతంలో మరిన్ని సాలిడ్ నంబర్స్ ని నమోదు చెయ్యడం గ్యారెంటీ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు