మహేశ్ “సర్కారు వారి పాట” ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

Published on May 28, 2022 2:00 am IST


సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ చిత్రం మే 12న థియేటర్స్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లను రాబట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్‌లో సందడి చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైం భారీ రేటుకు దక్కించుకున్నట్లు ఇప్పటికే వార్తలు రాగా, ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌పై కూడా ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఒప్పందం ప్రకారం పోస్ట్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం నెల రోజుల ముందుగానే ఈ సినిమాను అమెజాన్‌ స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే ఈ నెల చివరిలో లేదా జూన్‌ 10న ఈ సినిమా ఓటీటీలోకి రానుందని లేదంటే జూన్‌ 24న నుంచి స్ట్రీమింగ్‌ కానుందని సినీ వర్గాల నుంచి సమాచారం.

సంబంధిత సమాచారం :