సర్కారు వారి పాట “పెన్నీ సాంగ్” ప్రభంజనం.. 20 మిలియన్ వ్యూస్ క్రాస్..!

Published on Mar 23, 2022 9:01 pm IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి సాంగ్ “కళావతి” పలు రికార్డులను కొల్లగొట్టగా, ఇటీవల విడుదలైన “పెన్నీ” సాంగ్ కూడా యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. ఇప్పటికే 20 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి ప్రభంజనం సృష్టిస్తుంది. ఇకపోతే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :