సూపర్ స్ట్రాంగ్ గా “సర్కారు వారి పాట” ప్రీ సేల్స్.!

Published on May 11, 2022 1:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” బొమ్మ మరికొన్ని గంటల్లో పడబోతోంది. అయితే మన దగ్గర తో పాటుగా మహేష్ స్ట్రాంగ్ జోన్ అయినటువంటి యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా పట్ల భారీ సందడి నెలకొంది. దీనితో ఇక్కడ ఆల్రెడీ భారీ ఓపెనింగ్స్ ఖాయం అని ఆల్రెడీ అందరికీ అర్ధం అయ్యింది.

అయితే అక్కడ ఇది వరకే ప్రీమియర్స్ ప్రీ సేల్స్ కి గాను సాలిడ్ స్టార్ట్ తో మొదలు పెట్టిన ఈ సినిమా కొన్ని గంటల కితం రిపోర్ట్స్ ప్రకారం అయితే 6 లక్షల 70 వేల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే దీనితో ప్రీమియర్స్ పడే నాటికి అలాగే మొదటి రోజుతో 1 మిలియన్ మార్క్ ని ఈ సినిమా క్రాస్ చేసే అవకాశం ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమా ఒక్కసారి గాని హిట్ టాక్ తెచ్చుకొని నిలబడితే ఓవర్సీస్ లో డెఫినెట్ గా వండర్స్ నమోదు చేస్తుంది.

సంబంధిత సమాచారం :