యూఎస్ ప్రీమియర్స్ లో అదరగొడుతున్న “సర్కారు వారి పాట”.!

Published on May 12, 2022 8:00 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” ఈరోజే భారీ అంచనాలు నెలకొల్పుకొని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే మహేష్ కి మన దగ్గర మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా మహేష్ సినిమాలకి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగానే చాలా కాలం తర్వాత వచ్చిన ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర అయితే అదరగొడుతుందని చెప్పాలి. మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమా ప్రీమియర్స్ లోనే 9 లక్షల డాలర్స్ మార్క్ ని ఈ సినిమా దాటేసినట్టు కన్ఫర్మ్ అయ్యింది. అంటే ఇక ఈ ప్రీమియర్స్ మరియు మొదటి రోజుతో అయితే 1 మిలియన్ మార్క్ మహేష్ కి ఇప్పుడు కేక్ వాక్ అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా అయితే ఈ సినిమా వసూళ్లు ఏ మార్క్ కి చేరుకుంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం :