100 మిలియన్ చేరువలో సెన్సేషనల్ “కళావతి”.!

Published on Mar 22, 2022 9:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెన్సేషన్ ఇంకా రిలీజ్ కాకముందే ఓ రేంజ్ లో స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ ఇస్తున్న ఒక్కో పాట భారీ చార్ట్ బస్టర్ గా నిలిచి ఆల్ టైం రికార్డ్స్ కొల్లగొడుతున్నాయి.

మరి ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా వచ్చిన పెన్నీ సాంగ్ సౌత్ ఇండియా ఆల్ టైం రికార్డు నమోదు చేయగా దీనికి ముందు వచ్చిన సెన్సేషనల్ కళావతి అయితే అనుకోని రీతిలో 100 మిలియన్ వ్యూస్ కి అత్యంత చేరువలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సాంగ్ స్పీడ్ కి అయితే పెన్నీ వచ్చే లోపే ఈ ఫిగర్ ని టచ్ చెయ్యాల్సి ఉండగా కాస్త లేట్ అయ్యింది. కానీ ఇప్పుడు అయితే జస్ట్ 5 లక్షల లోపే వ్యూస్ తో 100 మిలియన్ కి మాత్రం ఈ ఫస్ట్ సాంగ్ చేరువలో ఉంది. మరి ఇది ఈరోజే క్రాస్ చేస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :