శివరాత్రి కానుకగా “సర్కారు వారి పాట” నుంచి స్పెషల్ పోస్టర్..!

Published on Feb 28, 2022 11:45 pm IST


సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే రేపు మహా శివరాత్రి కనుక ఈ చిత్రం నుంచి రేపు ఉదయం 11:07 గంటలకు ఓ స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం మే 12న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలకి మంచి రెస్పాన్స్ రాగా, తొలి సింగిల్‌గా వచ్చిన “కళావతి” సాంగ్ అయితే రికార్డులను సృష్టిస్తుంది.

సంబంధిత సమాచారం :