లేటెస్ట్..ఈ థియేటర్లో స్పెషల్ షో కి “సర్కారు వారి” టీం తో నమ్రత.!

Published on May 14, 2022 12:56 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సమ్మర్ బ్లాక్ బస్టర్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురాం పెట్ల తెరలెక్కించిన ఈ సమ్మర్ సూపర్ ఎంటర్టైనర్ ఇప్పుడు థియేటర్ లలో మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా సక్సెస్ తో చిత్ర యూనిట్ అల్రెడీ సంబరాలు స్టార్ట్ చెయ్యగా ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ అంతా కూడా సినిమా సక్సెస్ లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం స్పెషల్ షో కి ఓ థియేటర్ లో సందడి చెయ్యబోతున్నారట.

మరి ఈ సినిమా స్పెషల్ షో ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ సుదర్శన్ 35 ఎం ఎం లో స్పెషల్ స్క్రీనింగ్ వేస్తుండగా ఈ షో కి గాను ఈ చిత్ర యూనిట్ అంతా హాజరు కావడంతో పాటుగా మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా చూడనున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ఈ షో మరింత స్పెషల్ గా మారింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :