అప్పుడే 1 మిలియన్ డాలర్స్ తో “సర్కారు వారి” స్ట్రామ్.!

Published on May 13, 2022 7:04 am IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట”. భారీ అంచనాలతో మహేష్ నుంచి మోస్ట్ అవైటెడ్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలు తమిళనాడు సహా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా అదిరే ఓపెనింగ్స్ ఖాయంగా థియేటర్ లలోకి వచ్చింది.

అయితే మహేష్ కి ఎంతో స్ట్రాంగ్ ఏరియా అయినటువంటి యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం అనుకున్నట్టు గానే ప్రీమియర్స్ మరియు ఫస్ట్ డే వసూళ్లతో 1.1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేసి సెన్సేషన్ ని నమోదు చేసింది. దీనితో ఈ సినిమా స్ట్రామ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక వీకెండ్స్ కి ఎలాంటి నంబర్స్ నమోదు చేస్తుందో లాంగ్ రన్ లో ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :