యూఎస్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా “సర్కారు వారి పాట”.!

Published on May 15, 2022 11:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఈ మూడు రోజుల్లో అదిరే వసూళ్లను ప్రపంచ వ్యాప్తంగా అందుకుంది. మరి మహేష్ కి సూపర్ స్ట్రాంగ్ ఏరియా అయినటువంటి ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రం అదరగొడుతుంది అని చెప్పాలి.

లేటెస్ట్ గా ఈ చిత్రం అక్కడ 1.8 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి ఈరోజు కలెక్షన్ తో సెన్సేషనల్ మార్క్ 2 మిలియన్ కి చేరుకోనుంది. మొత్తానికి అయితే ఈ చిత్రం యూఎస్ ఓ దుమ్ము లేపుతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :