వింటేజ్ మాస్ వైబ్స్ తీసుకొచ్చిన “సర్కారు వారి పాట” టైటిల్ ట్రాక్.!

Published on Apr 23, 2022 11:06 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే ఒక మోస్ట్ అవైటెడ్ సినిమాగా వస్తుంది.

పక్కాగా మహేష్ ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ ఇచ్చే ట్రీట్మెంట్ తో సిద్ధం అవుతున్న ఈ సినిమా నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాస్ టైటిల్ ట్రాక్ ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేసేసారు. అయితే ఈ సాంగ్ మాత్రం అందరి అంచనాలకి తగ్గట్టుగా ఎక్కడా తగ్గకుండా ఉందని చెప్పాలి.

మహేష్ మరియు థమన్ ల కాంబో అంటేనే ఒక క్రేజ్ ఉంది అలాంటిది వారి ఇంట్రో సాంగ్స్ కి సూపర్ క్రేజ్ కూడా ఉంది. మరి అలాగే ఈ సినిమా నుంచి ఎలా ఉంటుందా అని చూస్తున్న వారికి వింటేజ్ వైబ్స్ ని తీసుకొచ్చే విధంగా సాలిడ్ గా ఉంది.

సాంగ్ లిరిక్స్ మంచి మాస్ అండ్ ట్రెండీ గా ఉండగా థమన్ ఇచ్చిన ట్యూన్ కూడా అంటే క్యాచీ అండ్ మాస్ గా ఉంది. ఓవరాల్ గా అయితే సాంగ్ మాత్రం అదిరింది. ఇక సినిమాలో ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ మే 12 వరకు ఆగాల్సిందే.

సర్కారు వారి పాట టైటిల్ ట్రాక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :