యూఎస్ లో రికార్డు మార్క్ కి చేరుకున్న “సర్కారు వారి పాట” వసూళ్లు.!

Published on May 14, 2022 5:15 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ లు హీరో హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట” మొదటి రోజు నుంచే మంచి వసూళ్లతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రం సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తుంది.

అయితే అంతకంతకు లక్ష డాలర్స్ మార్క్ ని క్రాస్ చేస్తుండగా తాజాగా అయితే ఈ సినిమా రికార్డు మార్క్ 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసేసిందట. మరి ఈ స్పీడ్ లో అయితే ఇక సోమవారం నాటికి డెఫినెట్ గా 2 మిలియన్ డాలర్స్ మార్క్ కి చేరుకోవడం గ్యారెంటీ అని చెప్పాలి.

మొత్తానికి అయితే యూఎస్ లో మాత్రం ఈ చిత్రం అదరగొడుతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :