యూఎస్ లో అన్ స్టాప్పబుల్ గా “సర్కారు వారి పాట” సెన్సేషన్.!

Published on May 13, 2022 2:30 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ లు హీరో హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వడంతోనే మొదటి రోజు భారీ వసూళ్ళని ఈ చిత్రం అందుకుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అదిరే కలెక్షన్ ని అందుకుంటూ దూసుకెళ్తుంది.

మరి తాజాగా అయితే ఈ సినిమా 1.2 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినట్టుగా అనౌన్స్ అయ్యింది. దీనితో మొదటి రెండు రోజుల్లోనే అన్ స్టాప్పబుల్ గా ఈ సినిమా భారీ ఫిగర్స్ నమోదు చేస్తుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ స్పీడ్ లో అయితే వీకెండ్ లోపే 2 మిలియన్ మార్క్ కి ఈ చిత్రం వచ్చేస్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :