అఫీషియల్.. “సర్కారు వారి పాట”కి రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on Jan 31, 2022 9:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రం కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది.

అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండడంతో భారీ బడ్జెట్ సినిమాలన్ని ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్లని ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా “సర్కారు వారి పాట” కూడా కొత్త రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. మే 12, 2022న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ లవ్ సాంగ్ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :