దీపావళి కానుకగా ‘సర్కారు వారి పాట’ నుంచి.. !

Published on Oct 12, 2021 1:09 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకి సంబంధించిన ఓ అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను దీపావళి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పాటల పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

వచ్చే ఏడాది రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ లో ‘సర్కారు వారి పాట’ కూడా ఒకటి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి మహేష్ బర్త్ డేకి వచ్చిన స్పెషల్‌ వీడియో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా సాగుతోంది.

సంబంధిత సమాచారం :