స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమా ఎవరి ఊహకూ అందకుండా, బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ సాధిస్తూ సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటిరోజు అన్నిచోట్లా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఈ స్థాయిలో మెప్పిస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకు టార్గెట్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పదిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సరైనోడు సినిమా 53.78 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించి బన్నీ కెరీర్‌కు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
నైజాం, ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఒక్క నైజాంలోనే మొదటి పదిరోజుల్లో 13.97 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి ‘సరైనోడు’ పేరు నిలబెట్టుకున్నాడు. ఇక ప్రాంతాల వారీగా మొదటి వారం కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
ఏరియా |
కలెక్షన్స్ (షేర్) |
నైజాం | 13.97 కోట్లు |
సీడెడ్ | 8.18 కోట్లు |
కృష్ణా | 2.84 కోట్లు |
గుంటూరు | 3.87 కోట్లు |
నెల్లూరు | 1.64 కోట్లు |
తూర్పు గోదావరి | 3.53 కోట్లు |
పశ్చిమ గోదావరి | 3.10 కోట్లు |
వైజాగ్ | 5.35 కోట్లు |
కర్ణాటక | 6.25 కోట్లు |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.10 కోట్లు |
ఓవర్సీస్ | 3.95 కోట్లు |
మొత్తం | 53.78 కోట్లు |