రక్షిత్ అట్లూరి హీరోగా “శశివదనే” కాన్సెప్ట్ టీజర్ విడుదల

Published on Sep 16, 2021 8:28 pm IST


పలాస 1978 సినిమాతో చలచిత్ర పరిశ్రమ ప్రముఖులను, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి. ప్రేక్షకుల హృదయాలను కదిలించే మరో మంచి కథతో సినిమా చేస్తున్నారు. రక్షిత్ అట్లూరి హీరోగా ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా శశివదనే. ఈ చిత్రంలో కోమలీ ప్రసాద్ కథానాయిక గా నటిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. గురువారం సినిమాను ప్రకటించడంతో పాటు చిత్ర యూనిట్ కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు.

టీజర్‌లో సంభాషణలు, దృశ్యాలు, కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు. ఒక నీతిని నిర్మించలేరు అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను గోడపై చూపించడం ద్వారా సినిమాపై ఆసక్తి కలిగించాయి. ఈ సందర్భంగా నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ, “అందమైన, అర్థవంతమైన ప్రేమకథా చిత్రం శశివదనే. ఈ రోజు విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్‌కు బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. అక్టోబర్ లో చిత్రీకరణ ప్రారంభిస్తాం. రక్షిత్, కోమలీ ప్రసాద్ జంట ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుంది. మరిన్ని వివరాల్లో త్వరలో వెల్లడిస్తాం” అని చెప్పారు. రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం శరవణ వాసుదేవన్ అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :