టీజర్‌తో రెడీ అయిపోయిన శర్వానంద్ సినిమా..!
Published on Oct 10, 2016 8:59 am IST

sharwanand
వరుస విజయాలతో జోరు మీదున్న హీరో శర్వానంద్ ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాలను లైన్లో పెట్టి స్టార్ లీగ్‌లో చేరిపోయేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఒకటైన దిల్‌రాజుతో కలిసి చేస్తోన్న ‘శతమానం భవతి’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గోదావరి జిల్లాల్లో జరుగుతోంది. ఇక దసరా కానుకగా ఫస్ట్ టీజర్‌ను విడుదల చేసేందుకు టీమ్ ఏర్పాట్లు చేసుకుంది.

సినిమా కథను పరిచయం చేస్తూ రానున్న ఈ ఫస్ట్ టీజర్‌ను ఈ సాయంత్రమే విడుదల చేయనున్నారు. ‘అ..ఆ..’, ‘ప్రేమమ్’ సినిమాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు వేగేశ్న సతీష్ దర్శకుడు. ప్రకాష్ రాజ్, జయసుధ లాంటి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు.

 
Like us on Facebook