
శతమానం భవతి చిత్రంతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న గత ఏడాది నితిన్ తో శ్రీనివాస కళ్యాణం అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని చవి చూసింది. ఇక ఈచిత్రం తరువాత కొంచం గ్యాప్ తీసుకుని మరో ఫ్యామిలీ ఎంటర్టైనేర్ ను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు ఈ డైరెక్టర్.
ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మించనున్న ఈచిత్రానికి ‘అల్ ఈజ్ వెల్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈచిత్రంలో హీరో గా నాగశౌర్య తీసుకోవాలనుకుంటున్నారట మేకర్స్. మరి ఇటీవల వరస పరాజయాలను చవిచూసిన శౌర్య ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో మరి కొద్దీ రోజుల్లో తెలిసిపోనుంది.