వెర్సటైల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ – కన్నడ నటుడు డాలీ ధనంజయ కలిసి నటించిన సినిమా “జీబ్రా”. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాను నవంబరు 22న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుందని గతంలో వెల్లడించారు. కానీ, దీపావళి రేస్ నుంచి తప్పుకుని నవంబరు 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
ఇక ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించనుండగా కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం మరియు దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఇంతకీ, ఈ సినిమా సత్యదేవ్ కు ఎటువంటి హిట్ ను ఇస్తుందో చూడాలి.