హార్డ్ హిట్టింగ్ గా సత్యదేవ్ “గాడ్సే” ట్రైలర్.!

Published on Jun 9, 2022 11:29 am IST

తన స్వయంకృషితో చిన్న చిన్న పాత్రల నుంచి హీరోగా మారిన మన టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్య దేవ్. ఇంట్రెస్టింగ్ సినిమాలు వాటికి మించి తన సాలిడ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకునే సత్యదేవ్ కెరీర్ లో మంచి పేరు తెచ్చిన చిత్రం “బ్లఫ్ మాస్టర్”. అయితే ఈ సినిమాకి ఉండగా ఉండగా మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాని తెరకెక్కించిన అదే దర్శకుడు గోపి గణేష్ తెరకెక్కించిన మరో చిత్రం “గాడ్సే”.

ఫస్ట్ నుంచి మంచి బజ్ ని సంతరించుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే గత సినిమాలో ఎలాగైతే అందరికీ కనెక్ట్ అయ్యే ఇంట్రెస్టింగ్ సోషల్ కాన్సెప్ట్ ని పట్టుకోగా ఈ సారి అంతకు మించిన సున్నిత అంశాన్ని మంచి హార్డ్ హిట్టింగ్ గా తెరకెక్కించినట్టు అనిపిస్తుంది.

అలాగే ప్రస్తుత పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఎలాంటి ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలో ఉంటున్నారు వారు నిజంగా ప్రజలకి ఏం చేస్తున్నారు వీటిపై ప్రశ్నిస్తే సామాన్యుడిని ఏం చేస్తారు అనే రియలిస్టిక్ అంశాలు తీశారు. అలాగే ఇందులో అయితే సత్యదేవ్ మంచి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

అలాగే దర్శకుడి టేకింగ్ గాని డైలాగ్స్ గాని చాలా బాగున్నాయి. ఇంకా సురేష్ సారంగం ఇచ్చిన సినిమాటోగ్రఫీ విజువల్స్ స్టన్నింగ్ గా కనిపిస్తున్నాయి. అలాగే సీకే క్రియేషన్స్ వారు అందించిన నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. మెట్టైకి అయితే ఈ ట్రైలర్ మంచి ప్రామిసింగ్ గా ఉంది. ఇక ఈ జూన్ 17న వచ్చే సినిమా అయితే ఎలా ఉంటుందో చూడాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :