వైరల్ : ‘గాడ్ ఫాదర్’ పై ఎమోషనల్ పిక్ షేర్ చేసిన సత్యదేవ్

Published on Oct 6, 2022 12:00 am IST


టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా గాడ్ ఫాదర్ నేడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మోహన్ రాజా తెరకెక్కించిన ఈ మూవీని మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి అధికారిక రీమేక్ గా రూపొందగా సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్, సునీల్, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు చేసారు. మెగాస్టార్ సూపర్ పెర్ఫార్మన్స్ తో పాటు దర్శకుడు మోహన్ రాజా సూపర్బ్ టేకింగ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

అలానే ఈ మూవీలో కీలకమైన జయదేవ్ పాత్రలో కనిపించి వండర్ఫుల్ గా పెర్ఫార్మ్ చేసిన సత్యదేవ్ పై కూడా అందరి నుండి మంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ విషయమై ఒకింత ఎమోషనల్ అయిన సత్యదేవ్, ఇటీవల గాడ్ ఫాదర్ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ తో కలిసి దిగిన ఒక ఎమోషనల్ పిక్ షేర్ చేస్తూ, నేను చెప్పగలిగింది ఇదే అంటూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసిన పిక్ ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతోంది. మొత్తంగా గాడ్ ఫాదర్ సక్సెస్ తో యూనిట్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :