సత్యదేవ్, తమన్నా ల ‘గుర్తుందా శీతాకాలం’ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Nov 27, 2022 12:03 am IST


విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ యూత్ ఫుల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గుర్తుందా శీతాకాలం. నిజానికి ఎప్పుడో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ కొన్ని కారణాల వలన ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి ఫైనల్ గా డిసెంబర్ 9న ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చేందుకు సిద్ధం అయింది.

ఈ మూవీ యొక్క తాజా విడుదల తేదీని మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మేఘ ఆకాష్ మరొక హీరోయిన్ గా నటించిన ఈ మూవీని భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి సంయుక్తంగా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాల భైరవ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్ని కూడా మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి. మరి రిలీజ్ తరువాత గుర్తుందా శీతాకాలం ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :