సత్యదేవ్, తమన్నాల “గుర్తుందా శీతాకాలం” కి రిలీజ్ సమయం ఫిక్స్.!

Published on May 12, 2022 3:00 pm IST

మన టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా దర్శకుడు నాగ శేఖర్ తెరకెక్కించిన చిత్రం “గుర్తుందా శీతాకాలం”. ఎప్పుడు నుంచో రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా ఫైనల్ ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ని ఈ చిత్రం తెచ్చుకుంది. మరి మేకర్స్ లేటెస్ట్ గా ఇచ్చిన అనౌన్సమెంట్ అయితే ఈ సినిమాని ఈ జూన్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు.

మరి ఫీల్ గుడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో మేఘా ఆకాష్ కూడా కీలక పాత్రలో నటించగా నటి కావ్య శెట్టి మరో కీలక పాత్రలో నటించింది. అలాగే కాల భైరవ సంగీతం అందించాడు. అలాగే శ్రీ వేదాక్షర మూవీస్ వారు తమ బ్యానర్ పై నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :