సత్యదేవ్ “గాడ్సే”లోని రా రమ్మంది సాంగ్ ప్రోమో రిలీజ్..!

Published on Jun 6, 2022 10:00 pm IST

విభిన్న కథా చిత్రాలతో అలరించే యంగ్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ‘స్కైలాబ్‌’ అనే కొత్త తరహా కథతో అలరించిన సత్యదేవ్‌ తాజాగా గోపీ గణేష్ పట్టాభి రచన, దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ “గాడ్సే” సినిమా చేస్తున్నాడు. సికే స్క్రీన్స్ బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 17వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాలోని “రా రమ్మంది” సాంగ్ ప్రోమో విడుదలయ్యింది. రేపు ఈ ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుండగా, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

సాంగ్ ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :