సత్యదేవ్ “గాడ్సే” రిలీజ్ కి రెడీ!

Published on May 18, 2022 5:02 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ పట్టాభి రచన, దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ గాడ్సే. సికే స్క్రీన్స్ బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం కి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని జూన్ 17 వ తేదీన భారీగా థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. ఇది తనకి తొలి టాలీవుడ్ చిత్రం. ఈ చిత్రానికి సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, సాగర్ ఉదగండ్ల ఎడిటర్ లు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :