సత్య దేవ్ “కృష్ణమ్మ” టీజర్ రిలీజ్ కి రెడీ!

Published on Aug 2, 2022 9:00 pm IST

గాడ్సేలో చివరిగా కనిపించిన యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ సత్య దేవ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అయిన గాడ్ ఫాదర్ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని రాబోయే చిత్రం కృష్ణమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో నటుడు ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు.

ఈ రోజు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా టీజర్‌ను ఆగస్టు 4వ తేదీ ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సత్య దేవ్ చేతిలో కత్తి పట్టుకుని నడుస్తున్న పోస్టర్‌ తో టీజర్ డేట్ అండ్ టైమ్ ను రివీల్ చేశారు. దీంతో ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2022 లో విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :