పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సత్యదేవ్ కొత్త చిత్రం!

Published on Sep 30, 2022 2:15 pm IST

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో నటించిన ప్రామిసింగ్ నటుడు సత్య దేవ్ తన కొత్త సినిమా కోసం సిద్దం అవుతున్నాడు. కొన్ని రోజుల క్రితం, నటుడి 26 వ చిత్రం ప్రకటించబడింది. ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో అతని కొత్త చిత్రం ప్రారంభం అయ్యింది. ఈరోజు నుండే రెగ్యులర్ షూటింగ్ కూడా షురూ అయింది.

హీరో సత్యదేవ్‌ తో పాటు చిత్ర నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం లాంచ్ వేడుకకు హాజరయ్యారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో పుష్ప ఫేమ్, కన్నడ నటుడు డాలీ ధనంజయ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం :