ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తన నెక్స్ట్ ను అనౌన్స్ చేసిన సత్యదేవ్!

Published on Jul 3, 2022 8:58 pm IST


గాడ్సేలో చివరిగా కనిపించిన యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ సత్య దేవ్ త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన కొత్త సినిమా టైటిల్ మరియు పోస్టర్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. కృష్ణమ్మ అనే టైటిల్ తో ఈ సినిమా పోస్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది.

సత్య దేవ్ ఒక నది దగ్గర కత్తిని పట్టుకున్నాడు మరియు ఎర్రటి పోస్టర్ మరియు టైటిల్ డిజైన్ చిత్రం చూస్తుంటే ఇది యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఆచార్య దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2022 లో విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :